ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 6:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దరియాపూర్ మోడల్ స్కూల్‌కు బస్ సేవలు, బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల కృతజ్ఞతలు

దరియాపూర్ మోడల్ స్కూల్‌కు బస్ సేవలు, బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల కృతజ్ఞతలు.

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | ముత్తారం రిపోర్టర్.

దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు ప్రత్యేక బస్ సేవలు ఏర్పాటు చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసిన 26 బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్‌లలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక పాఠశాలగా తమ పాఠశాలను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదివారం మంత్రి శ్రీధర్ బాబును ఆయన స్వగ్రామంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి చిరు సత్కారం చేశారు. గోదావరిఖని బస్ డిపో నుంచి దరియాపూర్ మోడల్ స్కూల్ వరకు బడి బస్ సేవలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా దరియాపూర్ మోడల్ స్కూల్‌కు బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ మంజూరుకు నీతి ఆయోగ్ నుంచి అధికారిక అనుమతి లభించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాలను సందర్శించాలని విద్యార్థులు మంత్రి శ్రీధర్ బాబును కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రధానాచార్యులు తెలిపారు.

దరియాపూర్ మోడల్ స్కూల్‌ను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష, జిల్లా విద్యాధికారి శారద, జిల్లా ఏఎంఓ డాక్టర్ పి.ఎం. షేక్, ముత్తారం (మంథని) మండల విద్యాధికారి నలుమాసు హరిప్రసాద్, గ్రామ సర్పంచ్ రాపెల్లి రాజయ్యతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.